Lyricist Anantha Sriram | ప్రముఖ టాలీవుడ్ రచయిత అనంత శ్రీరామ్ అమరావతిలో జరిగిన హైందవ శంఖారావం బహిరంగ సభలో తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు ఇండియన్ సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందని.. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారని.. హైందవ ధర్మ హననం జరుగుతుందని అనంత్ శ్రీరామ్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. తెర వెనక సినిమాల్లో అన్య మతస్తులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే.. ఒక పాటలో ‘బ్రహ్మాండ నాయకుడు’ అన్న హిందూపదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. దీంతో నేను.. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను నేను పాట రాయలేదు. అంటూ చెప్పుకోచ్చాడు. అయితే అనంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఇక అనంత్‌కి అలా చెప్పిన సంగీత దర్శకుడు ఎవరని నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
“ఒక Music Director ‘బ్రహ్మాండనాయక’ అనే పదం ఉంది అని ఆ పాట చెయ్యను అన్నాడు” – Lyricist #AnanthaSriram
Evaru ayyi untaru..? pic.twitter.com/MVtOUuK2Ao
— Movies4u Official (@Movies4u_Officl) January 5, 2025