Sarkaru Vaari Paata | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. గీతా గోవిందం ఫేం పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి సినిమాపైన ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకుల అటెన్షన్‌ను తిప్పుకుంటుంది. ఇటీవలే ప్రమోషన్లను కూడా స్టార్ట్ చేసింది. అయితే ఈ ప్రమోషన్లలు సాంకేతిక నిపుణులతో జరపడం విశేషం అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఇలా ఆర్ట్‌డైరెక్టర్, ఎడిటర్, లిరిసిస్ట్ ఇలా క్రూ మెంబర్స్‌తో ప్రమోషన్లు జరుపలేదు.
ప్రముఖ గీత రచయిత అనంత్ శ్రీరామ్‌తో సర్కారువారి పాట బృందం తాజాగా ఇంటర్వూను జరిపింది. ఈ ఇంటర్వూలో భాగంగా అనంత్ శ్రీరామ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ చిత్రంలో ‘మురారీ’ అంటూ సాగే మెలోడీ డ్యూయేట్ బాగుంటదని వెల్లడించాడు. కళావతి పాట కోసం 42 వెర్షన్లు రాశాడని తెలిపాడు. అంతేకాకుండా సర్కారువారి పాట టైటిల్ సాంగ్ ట్యూన్ ఐడియా కూడా తనే ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో ఇప్పటివరకు విడుదలైన పాటలన్నిటికి అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన కళావతి పాటకు యూట్యూబ్‌లో 15కోట్ల వ్యూస్ వచ్చాయి. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ బ్యానర్లతో కలిసి మహేష్‌బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.