Lust Stories 3 | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ ఆంథాలజీ చిత్రం ‘లస్ట్ స్టోరీస్ 3’ అధికారిక ట్రైలర్ విడుదలయింది. ఆధునిక కాలంలో ప్రేమ, కోరికలు, మానవ సంబంధాలలోని క్లిష్టమైన భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. చూస్తుంటే ఈసారి మరింత బోల్డ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 18 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో నలుగురు ప్రముఖ దర్శకులు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా మరియు విశాల్ భరద్వాజ్ నాలుగు వేర్వేరు లఘు చిత్రాలను తెరకెక్కించారు. ఇందులో కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టే, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, గుర్తేహ్ పీర్జాదా, సనా తంపి, అలీ ఫజల్, రాధికా మదన్, అదితి రావు హైదరి మరియు సిద్ధార్థ్ వంటి ప్రముఖ తారాగణం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.