Hero Nani | వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు నాని. ఆయన హీరోగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ లోపే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు నాని. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి కలిసి నిర్మించనున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో ‘ఓజీ’ చిత్రాన్ని సుజిత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా పూర్తిచేసి, నాని ప్రాజెక్ట్‌లో బిజీ కానున్నారు సుజిత్. ఈ సందర్భంగా ‘ఇది సుజిత్ సినిమా.. పవర్ తర్వాత.. లవర్ వస్తాడు..’ అంటూ తన ఎక్స్‌లో ట్వీట్ చేశాడు నాని. ఒక క్రూరుడు అహింసామార్గాన్ని ఆశ్రయిస్తే తదనంతరం అతని జీవితంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.