చిన్ను, గీతికా రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ యూ రా’. ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలు. మంగళవారం ఈ సినిమా పాటలను లాంచ్ చేశారు. ఆద్యంతం హాస్యంతో అలరించే ప్రేమకథా చిత్రమిదని, కథలోని హారర్ ఎలిమెంట్ ఉత్కంఠను పంచుతుందని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రానికి కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని హీరో చిన్న పేర్కొన్నారు. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్లో నటించడం ఆనందంగా ఉందని నాయకానాయికలు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.