సెన్సిబుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన శేఖర్ కమ్ముల తాజాగా లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కగా, అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 24న విడుదలైంది.
ఇంటా బయటా లవ్ స్టోరీ చిత్రం దుమ్ము రేపుతుంది. యూఎస్ లో 226 ప్రదేశాలలో ప్రీమియర్ కాగా… $306,795 (రూ.2.26 కోట్లు) వసూలు చేసింది. ఇక తొలిరోజు 2,34,000 డాలర్స్ వసూళ్లను సాధించింది. ప్రీమియర్స్‌తో కలుపుకుని మొత్తంగా 540000 డాలర్స్ ఈ సినిమా సాధించింది. అంటే మొత్తంగా రూ.4.40కోట్ల రూపాయలు వచ్చాయి. ‘వకీల్ సాబ్’ సినిమాకైతే మొత్తంగా దాదాపు 750000 డాలర్స్ (రూ.5.75 కోట్లు) వసూళ్లను సాధించింది. తొలి రోజు కలెక్షన్స్ ప్రకారం చూస్తూ వకీల్ సాబ్‌ని అవలీలగా దాటేసింది.
2021లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి భారతీయ సినిమా ప్రీమియర్‌గా “లవ్ స్టోరీ” నిలిచింది.ఈ చిత్రాన్ని భారతదేశంతో పాటు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కొన్ని ప్రదేశాలలో కూడా విడుదల చేశారు. ఏపీ- తెలంగాణలో ఈ చిత్రం తొలి రోజు 6.8 కోట్ల రూపాయలు రాబట్టినట్టు తెలుస్తుంది. లాభాల పట్టాలంటే ఈ చిత్రంకు 36 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావలసి ఉంది. లవ్ స్టోరీలో పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, దేవయాని, రావు రమేష్ , ఈశ్వరి రావు, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు.