Love Mouli Movie | టాలీవుడ్ నటుడు నవదీప్ చాలారోజుల తర్వాత నటించిన తాజా చిత్రం. ‘లవ్ మౌళి’ (Love Mouli). అవనీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పంఖురి గిద్వానీ కథనాయికగా నటించింది. ఈ సినిమాను నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలై మూడు వారలు కూడా కాకముందే ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో జూన్ 27వ నుంచి (Love Mouli ott) ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా (Aha) సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మౌళి (నవదీప్) చిన్నప్పుడే అమ్మానాన్నలు విడిపోతారు.తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోవడంతో మౌళిని తాతయ్యే పెంచి పద్ద చేస్తాడు. మౌళి 14 ఏళ్ళ వయసున్నపుడు తాతయ్య కూడా చనిపోతాడు. ఇక మౌళికి మంచి చెడు నేర్పేవారెవరూ లేకపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్టు పెరుగుతాడు. సమాజంతో పనిలేకుండా తన లోకంలో తను ఉంటాడు. అయితే మౌళిలో ఒక టాలెంట్ ఉంటుంది. అతను ఒక గొప్ప పెయింట్ ఆర్టిస్ట్. మేఘాలయలో స్వంత రిసార్ట్ ఉంటూ తనకు తీరిక దొరికినపుడు పెయింట్స్ వేస్తూ ఉంటాడు. మౌళికి ఒక మేనేజర్ కూడా ఉంటుంది. అమె పేరు హారిక. ఆమెనే మౌళి వేసిన పెయింట్స్ అమ్మిపెడుతూ ఉంటుంది. ఇలా కాల గడుస్తూ ఉండగా ఓ రోజు మౌళి అడవుల్లోకి వళ్తాడు. అక్కడ అతనికి ఓ అఘోరా(Rana)కనిపిస్తాడు. అతను ప్రేమ గురించి టాపిక్ తీస్తాడు. అప్పుడు మౌళి ప్రేమ గురించి నెగిటివ్‌గా మాట్లాడతాడు. దీంతో అఘోర ఓ పెయింట్ బ్రష్ ని సృష్టించి మౌళి దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు.
He is gonna make you think hard about LOVE & RELATIONSHIPS 🔥
A heart breaking love story #LoveMouli Premieres June 27th!@pnavdeep26 pic.twitter.com/kYqR3CDzPE
— ahavideoin (@ahavideoIN) June 22, 2024