LIK First Punch | తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వదిలేసి వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది లవ్‌టుడే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ నటుడు రీసెంట్గా డ్రాగన్ సినిమాతో మరో హిట్‌ని అందుకున్నాడు. అయితే తాజాగా ప్రదీప్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ప్రేమలు భామ మమితా బైజుతో డ్యూడ్ అనే సినిమా చేస్తున్న ప్రదీప్ తాజాగా మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ప్రదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ(Love Insurance kompany). ఈ సినిమాకు నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ ఎస్ లలిత్ కుమార్‌తో కలిసి నయనతార నిర్మిస్తుంది.
ప్రదీప్ రంగనాథన్‌తో పాటు, S J సూర్య, కృతి శెట్టి, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ పంచ్ పేరిటా టీజర్‌ను విడుదల చేశారు. భవిష్యత్‌లో(2040) ప్రేమ ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నయనతార ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుందని ఆమె తెలిపారు.
ఈ టీజర్లో చెన్నై భవిష్యత్‌లో ఎలా ఉండబోతుందని చూపించారు. హాలీవుడ్ తరహాలో కోలీవుడ్ కొండపై రాసి ఉండగా.. “మిషన్ ఇంపాజిబుల్ 14” సినిమాలో యష్ నటిస్తున్నట్లు, రజినీకాంత్ 2040లో తలైవర్ 189 సినిమా చేస్తున్నట్లు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు మేకర్స్.