న్యూఢిల్లీ : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అప్‌కమింగ్ మూవీ పఠాన్ మూవీని ఓవైపు వివాదాలు చుట్టుముట్టగా మరోవైపు మూవీపై అంచనాలూ నెక్ట్స్ లెవెల్‌కు చేరాయి. 5000కి పైగా స్క్రీన్లలో పఠాన్ గ్రాండ్ రిలీజ్‌కు సన్నద్ధమవుతుండగా సినిమాలోని పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది.
ఇన్‌స్టాగ్రాంలో పలువురు పఠాన్ సాంగ్ హుక్ స్టెప్స్ రీక్రియేట్ చేస్తూ డ్యాన్స్ వీడియోలను రూపొందించి నెట్టింట సందడి చేస్తున్నారు. తాజాగా షారుక్ ఖాన్‌ను పోలిన ఓ వ్యక్తి ఝూమే జో పఠాన్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకటికి రెండు సార్లు క్లోజ్ లుక్‌లో చూస్తే గానీ ఇబ్రహీం ఖద్రిని గుర్తించలేము.
ఇబ్రహీం షారుక్ ఖాన్‌ను తలపించేలా పెప్పీ సాంగ్‌కు డ్యాన్స్ వేస్తున్న క్లిప్‌ను షేర్ చేశారు. షారుక్ ఖాన్, దీపికా పదుకునే డ్యాన్స్ మూమెంట్స్‌తో ఈ సాంగ్‌ను రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ లక్షల మంది వీక్షించారు.ఇక ఇబ్రహీం ఖద్రి షేర్ చేసిన ఈ వీడియో 80 లక్షలకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. ఈ వీడియోలో ఖద్రి షారుక్ ఖాన్‌లా కనిపిస్తూ బాలీవుడ్ బాద్షా మూమెంట్స్‌ను దించేశాడని నెటిజన్లు పేర్కొన్నారు.