Coolie Movie | కూలీ సినిమాతో సూపర్ హిట్‌ని అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నటుడు కార్తీతో ఖైదీ 2 సినిమాను లైన్లో పెట్టిన లోకేష్.. ఈ సినిమా కంటే ముందే మరో బిగ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నాడని సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌లతో కలిసి కలిసి లోకేష్ ఒక భారీ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇద్దరు వయసు మళ్లిన గ్యాంగ్స్టర్ల కథ అని తెలుస్తుంది. ఇద్దరు లెజెండరీ నటుల ఇమేజ్‌కు తగ్గట్టుగా లోకేష్ కనగరాజ్ ఈ కథను సిద్ధం చేశాడని.. ఈ కథకు ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) నిర్మించనుందని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన రాబోతుంది.
Superstar #Rajinikanth & #KamalHaasan to act Together Under #LokeshKanagaraj‘s Direction & in RKFI Production..😲💥 Project is said to be in Talks..🤝 This Project was supposed to happen even before Covid..✌️ The Film is about “TWO AGING GANGSTERS..”🔥 pic.twitter.com/bQW8mBPJh8
— Laxmi Kanth (@iammoviebuff007) August 19, 2025