Aamir Khan – Lokesh Kanagaraj | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు గత ఏడాది నుంచి వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తలపై ఆమిర్ ఖాన్ ప్రకటించగా.. తాజాగా దీనిపై లోకేష్ మాట్లాడాడు. భవిష్యత్‌లో ఆమిర్ ఖాన్ సర్‌తో సినిమా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఒక సూపర్ హీరో సినిమాగా రాబోతుందని వస్తున్న వార్తలపై లోకేష్ క్లారిటీ ఇస్తూ.. భారీ యాక్షన్ జానర్లో రాబోతుందని వెల్లడించాడు. అలాగే వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు తెలిపాడు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం కూలీ. రజనీకాంత్ హీరోగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత తాను కార్తితో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నట్లు లోకేష్ తెలిపాడు. ఖైదీ 2 పూర్తయ్యాక ఆమిర్‌తో సినిమా ఉంటుందని తెలిపాడు. ఇవే కాకుండా సూర్యతో రోలెక్స్ ఉందని.. కమల్ హాసన్‌తో ‘విక్రమ్ 2’ విజయ్ సర్‌తో ‘మాస్టర్ 2’, ‘లియో 2’ చేయాలనుందని తెలిపాడు.