ైస్టెలిష్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలతో దక్షిణాదిలో తనదైన ముద్రను వేశారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, కూలీ వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. రజనీకాంత్‌తో ‘కూలీ’ తర్వాత ఆయన తమిళంలో రజనీ-కమల్‌హాసన్ మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని తెలుగు స్ట్రెయిట్ చిత్రంపై దృష్టి పెడుతున్నారట లోకేష్ కనకరాజ్. పవన్‌కల్యాణ్‌తో ఆయన ఓ సినిమా చేయబోతున్నారని, దానికి ఇప్పటికే రంగం సిద్ధమైందని ఫిల్మ్‌నగర్ టాక్. కన్నడంలో పేరొందిన అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందట.
ఈ సినిమాలో నటించేందుకు పవన్‌కల్యాణ్ సుముఖంగా ఉన్నారని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత పవన్‌కల్యాణ్ మరే ప్రాజెక్ట్‌కు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.