Kaithi 2 Music Director |తమిళ హీరో కార్తీ (Karthi), తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ (Kaithi). 2019లో విడుదలైన ఈ చిత్రం కార్తీ కెరీర్లో మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు రాబోతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కూలీ సినిమా విడుదల తర్వాత ఖైదీ 2 ఉండబోతుందని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా సంగీత దర్శకుడికి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం హాట్టాప్కిగా మారడంతో పాటు అభిమానులలో అందోళనకి గురిచేస్తుంది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. తన తదుపరి సినిమాలన్నింటికీ అనిరుధ్ రవిచందర్తోనే కలిసి పనిచేస్తానని లోకేష్ సంచలన ప్రకటన చేశాడు. అనిరుధ్ రిటైర్ అయ్యేంతవరకు మరొకరితో పనిచేయబోనని లోకేష్ తెలిపాడు. దీంతో లోకేష్ చేసిన వ్యాఖ్యలు ‘ఖైదీ’ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
‘ఖైదీ’ మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి ముఖ్య కారణం సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్(Sam CS) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. పాటలు లేని ఈ చిత్రానికి సామ్ అందించిన బీజీఎం ప్రాణం పోసింది. ముఖ్యంగా కార్తీ బిర్యానీ తినే సీన్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకే హైలైట్‌గా నిలిచింది. దీంతో ‘ఖైదీ 2’లో కూడా సామ్ సి.ఎస్. మ్యాజిక్‌ను మరోసారి చూస్తామని అభిమానులు ఆశించారు. అయితే సడన్‌గా లోకేష్ మాత్రం నేను అనిరుధ్‌తో తప్ప ఇంకా ఎవరితో పని చేయనని చెప్పడం మూవీ లవర్స్‌ని అందోళన పరుస్తుంది.
అనిరుధ్ గొప్ప సంగీత దర్శకుడే అయినప్పటికీ ‘ఖైదీ’ మొదటి భాగంలో సామ్ సి.ఎస్. సృష్టించిన బీజీఎం స్థాయిని ఆయన అందుకోగలరా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ‘ఖైదీ 2’ చిత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. లోకేష్ ‘కూలీ’ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్‌లతో ఒక భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించే పనిలో ఉన్నారని, అలాగే నటుడిగా కూడా అరంగేట్రం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఖైదీ 2’ ఎప్పుడు మొదలవుతుందనేది ఆసక్తికరంగా మారింది.