Thalapathy 67 | లోకేశ్కనగరాజ్ దళపతి 67 అప్డేట్ వచ్చేసింది
లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) , విజయ్ (Vijay)కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందే. దళపతి 67 (Thalapathy 67)గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా అప్డేట్ వచ్చేసింది.
Thalapathy 67 | కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రస్తుతం విజయ్ (Vijay)తో మరో సినిమా చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దళపతి 67 (Thalapathy 67)గా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ వచ్చేసింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది.
‘దళపతి 67 మూవీ షూటింగ్ జనవరి 2న గ్రాండ్‌గా మొదలైంది. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది. విజయ్ సార్‌తో మూడోసారి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది..’ అని సెవెన్ స్క్రీన్ స్టూడియో ట్వీట్ చేసింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్టు సెవెన్ స్క్రీన్ స్టూడియో తెలియజేసింది.
ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు అందిస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ కాగా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. దళపతి 67 హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటుల వివరాలపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్ టీం.
ఫిబ్రవరి మొదటి వారంలో దళపతి 67 సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండబోతుందని ఇటీవలే మైఖేల్ ప్రమోషనల్ ఈవెంట్లో ప్రకటించాడు లోకేశ్. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
The one & the only brand #Thalapathy67, is proudly presented by @7screenstudio 🔥
We are excited in officially bringing you the announcement of our most prestigious project ♥️
We are delighted to collaborate with #Thalapathy @actorvijay sir, for the third time. @Dir_Lokesh pic.twitter.com/0YMCbVbm97
— Seven Screen Studio (@7screenstudio) January 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

