Lokesh Kanagaraj | అది ఫేక్ అకౌంట్.. దయచేసి ఫాలో అవ్వకండి : లోకేష్ కనగరాజ్
Lokesh Kanagaraj | ప్రస్తుత జనరేషన్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ‘మానగరం’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఇతడు ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్లు అందించాడు.
Lokesh Kanagaraj | ప్రస్తుత జనరేషన్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ‘మానగరం’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఇతడు ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్లు అందించాడు. ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ హీరోగా తలైవ 171 ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రజనీకాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. లోకేష్ కనగరాజ్ ఫేస్బుక్ పేజీ హ్యాక్‌కు గురైందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయంపై లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నా ఫేస్బుక్ (FB)పేజీ హ్యాక్‌కు గురైందని అని వస్తున్న వార్తలు అవాస్తవం. ఎందుకంటే నాకు ఫేస్బుక్ పేజీ లేదు. నేను X (ఇంతకుముందు ట్విట్టర్), అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఉన్నాను. ఇవి తప్ప నేను సోషల్ ఏ ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో లేను. ఫేస్బుక్లో నా పేరు మీద ఏదైనా ఖాతా ఉంటే అది ఫేక్ అకౌంట్. అలాంటి ఖాతాలను ఫాలో అవ్వకండని లోకేష్ రాసుకోచ్చాడు.
Hey all, I’m only available on Twitter and Instagram, I do not have or use any other social media accounts. Please feel free to ignore and unfollow any other hoax accounts!
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

