Kotha Lokah Movie | చిన్న సినిమాగా విడుదలై మలయాళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న ‘లోక చాప్టర్ 1చంద్ర’ (తెలుగులో కొత్త లోక) చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్ అక్టోబర్ 31 నుంచి మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
ఆగష్టు 28న విడుదలైన ఈ చిత్రం మలయాళంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. మలయాళంలో ఆల్టైమ్ హిట్గా రికార్డు నెలకోల్పిన ఈ చిత్రం ఇండస్ట్రీలో మొట్టమొదటి సారిగా రూ.300 కోట్లు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 40 రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. మరోవైపు కేవలం మలయాళంలోనే 50000 షోలు ప్రదర్శించిన తొలి సినిమాగా ‘లోక’ రికార్డు సృష్టించింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా నస్లేన్ కథానాయకుడిగా నటించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహారించాడు.
The world of Lokah unfolds exclusively on JioHotstar, streaming from October 31st.@DQsWayfarerFilm @dulQuer @kalyanipriyan @naslen__ @NimishRavi @SanthyBee#LokahOnJioHotstar #LokahUniverse #YakshiReturns #LokahChapter1 #Wayfarerfilms #DulquerSalmaan #DominicArun… pic.twitter.com/Va3c6PGttC
— JioHotstar Malayalam (@JioHotstarMal) October 24, 2025