Lokah Chapter 1 | థియేటర్లో దుమ్ము దులిపిన సినిమా ఓటీటీలో అంత బాగోలేదనే ట్రెండ్ ఇప్పటిది కాదు. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది ‘లోక చాప్టర్ 1 – చంద్ర’ సినిమా. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచి, వసూళ్లలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ జంటగా డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఇందులో కళ్యాణి మొదటి లేడీ సూపర్ హీరోగా కనిపించడం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సెప్టెంబర్ 4న విడుదలైన ఈ సినిమా మళయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ‘కొత్త లోక’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. థియేటర్ రన్లో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అంచనాలు పెంచింది.
అయితే, ఓటీటీ రిజల్ట్ మాత్రం విరుద్ధంగా మారింది. ఈ శుక్రవారం నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “థియేటర్లో అంత హైప్ ఇచ్చారు కానీ సినిమాలో కథేమీ లేదు”, “ కంటెంట్ స్లోగా ఉంది”, “ఎందుకు ఇంత పెద్ద హడావుడి చేశారు?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.థియేటర్లో సూపర్ హిట్ అయిన సినిమా ఓటీటీలో మిక్స్డ్ రిస్పాన్స్ అందుకోవడం మేకర్స్‌కి చిన్న షాక్‌గా మారింది. ఈ నెగిటివ్ టాక్ వల్ల ఓటీటీ వ్యూయర్షిప్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.
ఇక మేకర్స్ ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు? కొత్త ప్రమోషన్స్‌తో దాన్ని కవర్ చేస్తారా లేదా అనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏదేమైనా, థియేటర్లో సూపర్ హిట్ అయిన ‘లోక చాప్టర్ 1’ ఓటీటీలో మాత్రం సవాల్ ఎదుర్కొంటుంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించిన విషయం విదితమే.