Little Hearts | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ ఈ రోజు గ్రాండ్‌గా విడుదల అవుతుంది. అయితే గత రాత్రి ప్రీమియర్ షోస్ పడగా, మూవీ టాక్ బయటకు వచ్చింది. చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇస్తుందట. అటు జనసైనికుల్ని ఇటు మెగా అభిమానుల్ని మరోసారి కాలర్ ఎగరేసేట్టు చేశాడు ‘ఓజీ’. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో * ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు. ప్రకాశ్ రాజ్ పాత్ర కూడా చాలా బాగుందట. శ్రియారెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, సుదేవ్ నాయర్, తేజ్ సప్రూ, సత్యప్రకాష్, అభిమన్యు సింగ్, ‘కిక్’ శ్యామ్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్, అజయ్ ఘోష్, జీవా, ‘యానిమల్’ ఫేమ్ ఉపేంద్ర లిమయే, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, సమ్మెట గాంధీ ఇలా పెద్ద తారాగణంతో సినిమాని సుజీత్ బాగా నడిపించాడట.
అయితే టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ ఓజీకి మద్దతుగా ముందుకు నిలవడం మరో విశేషం. ఇటీవలే మిరాయ్ టీమ్ తమ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఓజీ స్పెషల్ షోలు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా లిటిల్ హార్ట్స్ నిర్మాత బన్నీ వాస్ కూడా OGకు అండగా నిలిచారు. ఓజీ ప్రీమియర్ షో కోసం తమ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో సహకారం అందించాలని ఆయన డిస్ట్రిబ్యూటర్స్ను కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాను సెలబ్రేట్ చేసుకునేందుకు ఇండస్ట్రీ అంతా ఒకే తాటిపైకి రావడం విశేషంగా మారింది.
ఇక ఓజీ చిత్రానికి థమన్ సంగీతం , రవికే చంద్రన్ – మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలుగా నిలవగా, DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. భారీ అంచనాలతో వచ్చిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది . ఈ సినిమాలో గమ్మత్తైన విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శించే ప్రకాశ్ రాజ్ చేత ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి ఎలివేషన్స్ ఇప్పించాడు సుజీత్. ఇవి ప్రేక్షకులకి మాంచి కిక్ ఇచ్చాడు. సత్యదాదాగా ప్రకాష్ రాజ్.. సినిమాకి మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. పవన్, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సీన్లు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తాయి.