Tollywood 2024 | మరో 12 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2025 ఇయర్ కొత్త ఆలోచనలతో.. కొత్త రిసల్యూషన్స్తో మొదలు కాబోతుంది. ఇక టాలీవుడ్‌కి కూడా వచ్చే ఏడాది మరపురాని ఇయర్‌గా నిలవనుంది. ఈ ఏడాది కల్కి, పుష్ప 2 దేవర, హన్మాన్, గుంటూరు కారం సినిమాలు వచ్చి సందడి చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇక వచ్చే ఏడాది కూడా గేమ్ ఛేంజర్‌తో పాటు డాకు మహారాజ్, హరిహర వీరమల్లు, ఓజీ తదితర చిత్రాలు రానున్నాయి. అయితే ఈ ఏడాది తెలుగులో వచ్చిన మంచి బెస్ట్ మూవీస్ లిస్ట్ చూసుకుంటే..?
హన్ – మాన్
Hanuman
ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు పోటిపడతాయి అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా పోంగల్కి మహేశ్ బాబు ‘గుంటూరు కారం'(Guntur Kaaram)తో పాటు వెంకటేశ్ సైంధవ్(Saindhav), నాగార్జున నా సామి రంగా(Naa Saami Ranga), ప్రశాంత్ వర్మ హన్మాన్(Hanu Man) చిత్రాలు వచ్చాయి. గుంటూరు కారం (Guntur Kaaram) ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా.. సైంధవ్ అయితే ఏకంగా డిజాస్టార్ అయ్యింది. నాగార్జున నా సామి రంగా పర్వాలేదు అనిపించగా.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హన్- మాన్ ఏకంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. డబ్బింగ్ సినిమాలు చూసుకుంటే శివ కార్తికేయన్ అయాలన్తో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ యావరేజ్‌గా నిలిచాయి.
ఊరుపేరు భైరవకోన
Ooru Peru Bhairavakona
ఫిబ్రవరి నెలలో తెలుగు నుంచి చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ను పలకరించగా.. ఇందులో ఒక్క చిత్రం మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రమే సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరుపేరు భైరవకోన. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ చిత్రం రూ.50 కోట్ల వరకు వసుళ్లను రాబట్టింది. డబ్బింగ్ సినిమాలు చూసుకుంటే రజనీకాంత్ లాల్ సలామ్ ప్రేక్షకుల ముందుకురాగా.. డిజాస్టార్‌గా నిలిచింది.
టిల్లు స్క్వేర్
Tillu Square
మార్చి నెలలో కూడా తెలుగు బాక్సాఫీస్‌కి ఆశించిన స్థాయిలో హిట్లు రాలేదు. నెల ప్రారంభంకాగానే.. మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ అంటూ వచ్చి బొక్క బోర్లా పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన విశ్వక్ సేన్ గామి, శ్రీ విష్టు ఓం భీమ్ బుష్ సినిమాలు పర్వాలేదనిపించాయి. అనంతరం వచ్చిన గోపిచంద్ భీమా సైతం ఫ్లాప్ అందుకుంది. అయితే హిట్లు లేక సతమతమవుతున్నా టాలీవుడ్‌ని టిల్లు స్క్వేర్ అంటూ వచ్చి గాడిలో పెట్టాడు సిద్దూ జొన్నలగడ్డ. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
హిట్లు లేని ఏప్రిల్, మే
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో తెలుగు సినిమా నుంచి ఒక్క హిట్టు కూడా నమోదు కాలేదు ఏప్రిల్‌లో ఫ్యామిలీ స్టార్ అంటూ రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రం డిజాస్టార్‌ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది, శ్రీరంగ నీతులు చిత్రాలు సైతం ఫ్లాప్ ముటగట్టుకున్నాయి. ఇక మే నెలలో వచ్చిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు, సత్యదేవ్ కృష్ణమ్మ చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయాయి. డబ్బింగ్ చిత్రాలలో తమిళ బాక్ చిత్రం మంచి హిట్ అందుకుంది.
కల్కి 2898 ఏడీ – మహారాజ
Kalki 2898 Ad
హిట్లు లేక సతమతమవుతున్న తెలుగు ఇండస్ట్రీకి కల్కి రూపంలో భారీ బ్లాక్ బస్టర్ లభించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మహాభారతం & ఫ్యూచర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో టాలీవుడ్లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటిచిత్రంగా నిలిచింది. శర్వానంద్ మనమే కూడా ఇదే నెలలో విడుదల కాగా.. మంచి విజయాన్ని అందుకుంది. డబ్బింగ్ చిత్రాలలో తమిళం నుంచి బ్లాక్ బస్టర్ అందుకుంది. మహారాజా. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులోను సూపర్ హిట్ అందుకుంది.
రాయన్
Raayan
జూలై నెలలో తెలుగు సినిమాలకంటే తమిళ సినిమాల హావా ఎక్కువగా నడిచింది. తెలుగు నుంచి ఒక్క పెద్ద సినిమా కూడా విడుదల కాకపోగా.. తమిళం నుంచి భారతీయుడు 2తో పాటు ధనుష్ నటించిన రాయన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాయన్ మంచి హిట్టును అందుకోగా.. భారతీయుడు డిజాస్టార్‌గా నిలిచింది.
సరిపోదా శనివారం, తంగలాన్
Saripodhaa sanivaaram
ఇండిపెండెన్స్ కానుకగా.. ఆగష్టు నెలలో చాలా సినిమాలు థియేటర్లో సందడి చేశాయి. కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిన్న సినిమాలు వచ్చి మంచి హిట్లు అందుకోగా.. నాని నటించిన సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ను అందుకుంది. ఇక తమిళం నుంచి విక్రమ్ నటించిన తంగలాన్ చిత్రం కూడా వచ్చి మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇదే నెలలో వచ్చిన పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్‌తో పాటు హారిశ్ శంకర్ రవితేజ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ అట్టర్ ఫ్లాప్ అందుకున్నాయి.
దేవర
Devara
సెప్టెంబర్ మొదలుకాగానే 35 సినిమాతో ఫీల్ గుడ్ హిట్ వచ్చింది. ఆ తర్వాత మత్తు వదలార 2 వచ్చి కామెడీ ఎంటర్టైనర్గా సూపర్ హిట్‌ను నమోదు చేసుకుంది. అయితే ఈ నెలలో రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకున్నాయి. తమిళం నుంచి విజయ్ నటించిన గోట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.400 కోట్ల వసూళ్లను రాబట్టగా.. తెలుగు నుంచి ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం వచ్చి మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా.. రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
క, లక్కీ భాస్కర్
Lucky Baskhar
అక్టోబర్ నెలలో క సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. క తర్వాత లక్కీ భాస్కర్ రూపంలో మరో సూపర్ హిట్ వచ్చింది. నవంబర్ నెలలో మట్కా, కంగువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. డిజాస్టార్ అందుకున్నాయి.
పుష్ప 2 ది రూల్
Pushpa
పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం పుష్ప 2 ది రూల్. అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది ఈ చిత్రం. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. బహుబలి తర్వాత రూ. 1400 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.