విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘లైగర్’. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనన్య పాండే నాయిక. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కోకా 2.0’ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌లో విజయ్, అనన్య మధ్య డాన్స్ నెంబర్‌గా ఈ పాట సాగనుంది. లిజో జార్జ్, డీజే చేతన్ స్వరపర్చిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించగా..రామ్ మిరియాల, గీతా మాధురి పాడారు. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతున్నది.