హీరో ఆదిత్య ఓం దర్శకుడిగా మారారు. 17వ శతాబ్దపు మరాఠీ సాధువు ‘సంత్ తుకారామ్’ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. మరాఠీ నటుడు సుభోద్ భావే టైటిల్ రోల్‌ని పోషించారు. ఈ నెల 18న విడుదలకానుంది.
సంత్ తుకారామ్ జీవితంలోని భక్తి, ప్రతిఘటన, విప్లవం వంటి అంశాలను చర్చిస్తూ ఆయన తాత్విక పరిణామ క్రమాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించామని, ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా ఇచ్చిన వాయిస్ఓవర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఆదిత్యం ఓం తెలిపారు. మరాఠీ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.