LGM Movie | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఎల్జీఎం’. హరీష్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో లవ్ టుడే భామ ఇవానా కథానాయిక పాత్రలో నటించింది. రమేశ్ తమిళ్మని దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28న రిలీజై.. మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. తెలుగులో వారం తర్వాత ఆగస్టు 4న విడుదలైంది. ఇక్కడ కూడా ఫ్లాప్ రివ్యూలను తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు భారీ స్థాయిలో ధోని భార్య సాక్షీ సింగ్ ప్రమోషన్లు గట్రా చేసిన.. కంటెంట్ దెబ్బ కొట్టడంతో సినిమా ప్లాప్ వెంచర్‌గా మిగిలింది. ఇక ధోని నిర్మించిన తొలి సినిమానే ఇలా ఫ్లాప్ అవడం ఆయన్ను తీవ్రంగా నిరాశ పరిచింది.
ఇక ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో మూడు రోజుల కిందట తమిళ వెర్షన్లో ఈ సినిమా రిలీజైంది. కాగా తాజాగా తెలుగు వెర్సన్ అందుబాటులోకి వచ్చింది. ఇక స్టోరీ విషయానికొస్తే..మీరాతో ప్రేమలో ఉన్న గౌతమ్.. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మతో కలిసి ఉండాలనుకుంటాడు. అయితే మీరాకు అలా ఉండటం ఇష్టం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరాకు, అమ్మకు మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడేందుకు కూర్గ్ ట్రిప్ ప్లాన్ వేస్తాడు హీరో. మరి ఇవానా కాబోయే అత్తతో సౌకర్యవంతంగా ఫీలవుతుందా..? లేదా..? ఆ తర్వాత జరిగే కథేంటి అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.