Megastar Chiranjeevi | డ్రగ్స్ రహిత (Drugs) సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే చిరంజీవి సహా పలువురు స్టార్ నటులు భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు.