 
                                                            Let’s Go Johnny | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దే కాల్ హిమ్ ఓజీ’ (They Call Him OG) నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “లెట్స్ గో జానీ” (Let’s Go Johnny) సాంగ్ ఫుల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్లో ఉన్న OGకి పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘జానీ’ చిత్రానికి ఉన్న రిఫరెన్స్‌ను వాడుతూ.. ఈ పాటను అదిరిపోయే బీట్తో తమన్ కంపోజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను ఆయన పాత్ర అయిన ఓజాస్ గంభీరా పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఈ పాట ఉంది. పవన్ కళ్యాణ్‌తో పాటు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
 
                            