Leo Trailer| కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది దళపతి టీం. తాజాగా లియో ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
విజయ్ టీం ఇప్పటికే సీరియల్ కిల్లర్ నడిరోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఇప్పటికే రోడ్డు మీద చాలా మంది చనిపోయారు. పాపులర్ క్రిమినల్. వాడు అందరినీ కాలుస్తున్నాడు. అప్పుడు ధైర్యంగా ఓ పోలీసాఫీసర్ సింహంలా వచ్చి.. ఈ సీరియల్ కిల్లర్‌ను తిరిగి కాల్చాడు.. అంటూ సాగే సంభాషణలతో సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
లియోలో యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన హెరాల్డ్ దాస్, సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. లియో నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
లియో చిత్రంలో ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.లియో విడుదలైన కొన్ని రోజుల తర్వాత 12A-rated version (అన్‌కట్ వెర్షన్/ కట్స్ లేకుండా) విడుదల చేయనున్నట్టు విజయ్ టీం ఇప్పటికే తెలియజేసింది.
లియో ట్రైలర్..
Serving you this virundhu from our hearts to yours ❤️
Here’s #LeoTrailer ▶️
Tamil: https://t.co/80TQzvqaLN
Telugu: https://t.co/Sk8Ezgr4np
Kannada: https://t.co/KvY4TpbUPw#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay @akarjunofficial… pic.twitter.com/xFW66BC3s8
— Seven Screen Studio (@7screenstudio) October 5, 2023
లియో అన్‌కట్ వెర్షన్ అప్డేట్..
Out of respect for Lokesh Kanagaraj’s vision, we’re committing to NO CUTS for #LEO‘s UK release. Every frame is essential, and audiences deserve to experience it in its raw form. Once we feel the film has reached a wide audience, we’ll switch to a 12A friendly version 🙌 pic.twitter.com/TJemUXVTwr
— Ahimsa Entertainment (@ahimsafilms) September 13, 2023
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..