Leo Movie | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). త్రిష హీరోయిన్గా నటించగా.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గత గురువారం తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా ప్రదర్శనలో తాజాగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది.
అమెరికాలోని ఓ థియేటర్లో ‘లియో’ సినిమా ప్రదర్శితమవుతుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్క్రీన్‌ను చింపేశాడు. ‘లియో’ విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందిన సంస్థ వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపిస్తూ ఇలా చేశానని ఆ వ్యక్తి తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
BREAKING:
An angry person tore the screen of Joseph Vijay’s #Leo in the middle of screening in USA.pic.twitter.com/yPySkB3Y0K
Shocking…
— Manobala Vijayabalan (@ManobalaV) October 25, 2023
ఇదిలా ఉంటే.. లియో సినిమా టాక్ ఎలా ఉన్న కలెక్షన్ ప్రవాహం మాత్రం ఆగడం లేదు. తొలిరోజుతో పోల్చితే కాస్త తగ్గాయి కానీ.. పర్వాలేదనిపించే కలెక్షన్లే వస్తున్నాయి. ఇక తెలుగులోనూ ఈ సినిమా జోరు మాములుగా లేదు. మూడు రోజుల్లోనే రూ.30 కోట్లు కొల్లగొట్టింది. పోటీగా భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలున్నా ఈ రేంజ్లో లియో కలెక్షన్లు సాధిస్తుందంటే విశేషం అనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు లియో సినిమా రూ.400 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
ఈ సినిమా జోరు చూస్తుంటే మరో రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల పట్టనున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకొచ్చిన డివైడ్ టాక్ కలెక్షన్ల మీద ఏమైనా ప్రభావం చూపుతుందో చూడాలి మరి. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చాడు.