Leo Movie | లియో టైటిల్ కోసం లక్షలు ఖర్చుపెట్టిన నాగవంశీ?
Leo Movie | అంతా బాగానే జరుగుతుందనుకున్న టైమ్‌లో లియో తెలుగు రిలీజ్‌పై కోర్టు స్టే విధించడంతో అందరూ ఒక్క సారిగా షాకయ్యారు. రెండు రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు ఇలా జరగడం ఏంటని విజయ్ తెలుగు ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
Leo Movie | అంతా బాగానే జరుగుతుందనుకున్న టైమ్‌లో లియో తెలుగు రిలీజ్‌పై కోర్టు స్టే విధించడంతో అందరూ ఒక్క సారిగా షాకయ్యారు. రెండు రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు ఇలా జరగడం ఏంటని విజయ్ తెలుగు ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఇక ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ఆడియెన్స్ సైతం టెన్షన్ పడ్డారు. కాగా రీసెంట్గా ఈ విషయంపై నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఖచ్చితంగా అనుకున్న తేదీకే రిలీజ్ అవుతుందని చెప్పాడు. చెప్పినట్లుగానే లియో టైటిల్ చుట్టూ అల్లుకున్న చిక్కులను తొలిగించాడు.
తెలుగులో లియో టైటిల్‌ను ఒకరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. దాంతో ఆ వ్యక్తితో చర్చలు జరిపి సమస్యకు ముగింపు పలికాడు. కాగా టైటిల్ రిజిస్టర్ చేసుకున్న వారికి నాగవంశీ రూ.26.5 లక్షలు ముట్టజెప్పి వివాదాన్ని ముగించినట్లు సమాచారం. ఇక లియో బుకింగ్స్ తెలుగులోనూ అదరగొడుతున్నాయి. పైగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కినట్లు ప్రచారం జరగడంతో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ఈ సినిమాను తెలుగులో నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడు.
దాదాపు రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగనున్న ఈ సినిమా తొలిరోజే అందులో సగం కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. సినిమాకు ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా.. తెలుగులో విజయ్‌కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమగా ఇది పక్కా నిలుస్తుంది. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

