Leo Movie | ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మున్నా సినిమా గుర్తుందిగా..! కన్న తండ్రిపై పగ తీర్చుకునే కొడుకుగా ప్రభాస్, ప్రకాష్ రాజ్‌ల రోల్స్ లానే లియోలో విజయ్, సంజయ్ దత్ రోల్స్ ఉండబోతున్నాయట. అంటే రీసెంట్గా రిలీజైన పోస్టర్ చూస్తుంటే చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది. సంజయ్ దత్.. లియోలో విజయ్‌కు తండ్రి. గ్యాంగ్‌స్టర్‌గా రాజ్యమేలుతున్న సంజయ్ దత్ మీద ప్రతీకారం తీర్చుకునే కాన్సెప్ట్‌తో ఈ సినిమా కథ ఉండబోతుందని చెన్నై వర్గాల టాక్. ఇంచు మించుగా మున్నా కథలానే.. ప్రభాస్, ప్రకాష్ రాజ్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా ఉంటుందో లియోలో సంజయ్ దత్, విజయ్‌ల మధ్య కూడా అలాగే ఉంటుందట.
ఇక ఆంటోని దాస్‌గా కనిపించిన అర్జున్ సర్జా.. లియోలో విజయ్‌కు అన్నగా నటించబోతున్నాడట. అంటే సంజయ్ దత్‌కు పెద్ద కొడుకులా నటిస్తాడని సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ స్టోరీ లైన్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. వంశీ పైడిపల్లి యాక్షన్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేక సినిమా ఫ్లాప్ అయింది కానీ.. కథ పరంగా చూసుకుంటే మున్నా అప్పటి సమయానికి మంచి కథే. ఇక ఇప్పుడు అలాంటి నేపథ్యం ఉన్న కాన్సెప్ట్‌తోనే సినిమా వస్తే మట్టుకు ఆడియెన్స్ సర్ప్రైజ్ అవడం పక్కా. ఎందుకుంటే లోకేష్ టేకింగ్ ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.
ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడు ఆయన. పైగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒళ్లు గగుర్పోడిచేలా ఉంటుందట. ఇక అందరికంటే ముందుగా దసరా స్లాట్‌ను బుక్ చేసుకుని.. అదే దిశగా పరుగులు పెడుతుంది లియో సినిమా. రిలీజ్‌కింకా నెల రోజులకు పైగా ఉన్నా.. చిత్రబృందం చక చక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటుంది. విక్రమ్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో లియో మీద మాములు అంచనాలు లేవు. బిజినెస్ లెక్కలు సైతం రెండొందల కోట్ల పై చీలుకే అని తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారట.