తమిళ అగ్ర హీరో విజయ్ తన తాజా చిత్రం ‘లియో’ చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేసుకున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్టోబర్ 18న విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత వెంకట్‌ప్రభు దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఆయన నటిస్తున్న 68వ చిత్రమిది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా కథ గురించి దర్శకుడు వెంకట్‌ప్రభు సోషల్‌మీడియా ద్వారా ఓ హింట్ ఇచ్చారు. హీరో విజయ్ ఫోటోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసినా ఆయన ‘భవిష్యత్తుకు స్వాగతం’ అంటూ క్యాప్షన్‌ను జోడించారు.
ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందించబోతున్నారని, భవిష్యత్తులోకి ప్రయాణం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రానుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ అన్నాదమ్ములుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ హీరోలు ప్రభుదేవా, జై ఈ సినిమాలో భాగం కానున్నట్లు సమాచారం.