Leo Movie | లియో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’లో భాగంగా సినిమా తెరకెక్కున్నట్లు వార్తలు రావడంతో లియోపై ఎక్కడలేని హైప్ పెరిగింది. దానికి తోడు విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సైతం మిలియన్లలో వ్యూస్‌ను సాధించి.. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుడంటంతో మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా మూడో పాటకు సంబంధించిన ఓ క్రేజ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలోని థర్డ్ సింగిల్ రేప రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే రిలీజైన నా రెడీ, బడాస్ సాంగ్స్ తమిళ తంబీలను తెగ ఆకట్టుకున్నాయి. అయితే తెలుగులో మాత్రం ఇప్పటివరకు ఒకటే పాట రిలీజైంది. అయితే అది కూడా శ్రోతలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారట. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమా ప్రమోషన్లు భారీ ఎత్తులో జరపాలని చూస్తున్నారట. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలుగులో డబ్ అయిన కొన్ని తమిళ సినిమాలు ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టాయి. దాంతో ఈ సినిమాను పెద్ద లెవల్లో ప్రమోట్ చేసి సినిమాపై క్రేజ్‌ను మరింత తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాపై వీర లెవల్లో బిజినెస్ జరుగుతుంది. ఎప్పుడూ లేనిది తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు పెట్టి కొనడం టాలీవుడ్ ట్రేడ్‌నే ఆశ్చర్యపరిచింది. పైగా పోటీగా భగవంత్ కేసరీ, టైగర్ నాగేశ్వరరావు వంటి భారీ సినిమాలు ఉండగా ఆ రేటు పెట్టడం అంటే రిస్క్ అనే చెప్పాలి. తమిళనాడులో సైతం ఈ సినిమా కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్లు తెగ పోటీ పడుతున్నారట.