Leo Movie | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). త్రిష హీరోయిన్గా నటించగా.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గురువారం తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అయ్యింది. అయితే భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అందరి అంచనాలను అందుకోవడంలో తడబడింది. ఖైదీ, విక్రమ్ సినిమాల రేంజ్లో ఉంటుందన్న ఆశతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను లియో ఫుల్‌గా సాటీస్‌ఫై చేయలేకపోయింది. మరోవైపు లియో సినిమా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగోలేదని సోషల్ మీడియాలో అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే విజయ్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై సంబరాలు చేసుకుంటున్నారు.
లియో సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.100 కోట్ల మార్క్ దాటేసింది కానీ.. రెండో రోజు ఈ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. రెండో రోజు కేవలం రూ.32 కోట్లు మాత్రమే కలెక్షన్లు నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు ఫ్లాఫ్ టాక్ రావడంతో విజయ్ సినిమాలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దళపతి విజయ్‌కి జంతు దోషం ఉందని.. అందుకే యానిమల్ (జంతువు పేరుతో) టైటిల్‌తో తీసిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక యానిమల్స్‌ని టైటిల్‌గా పెట్టుకుని విజయ్ నటించిన సినిమాలు చూస్తే..
కురువి 2008
విజయ్ త్రిష కాంబోలో 2008లో వచ్చిన చిత్రం కురువి (తెలుగులో పిచ్చుక). ఈ సినిమా బ్యాడ్ స్క్రీన్ ప్లే కారణంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక దీని తరువాత విజయ్ హీరోగా SB రాజ్‌కుమార్ దర్శకత్వంలో 2010లో విడుదలైన చిత్రం సురా (తెలుగులో షార్క్ చేప). ఈ సినిమా విజయ్ అభిమానులకు మరచిపోలేని మూవీ ఎందుకంటే విజయ్‌కి ఇది 50వ సినిమా కానీ ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
పులి
శింబుదేవన్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం పులి(Puli). 2015లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టార్ మూటగట్టుకుంది. ఈ చిత్రంలో విజయ్, హన్సిక, శ్రీదేవి, సుదీప్, శృతి హాసన్ నటించారు.
భైరవ
విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం భైరవ (తెలుగులో కుక్క). భరతన్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచింది.
బీస్ట్
కొలమావు కోకిల, డాక్టర్ వంటి చిత్రాలతో డార్క్ కామెడీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తమిళ దర్శకుడు నెల్సన్ దీలిప్. ఈ సినిమాల తరువాత విజయ్‌తో బీస్ట్ (తెలుగులో మృగం) సినిమా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా విజయ్ కెరీర్లోనే భారీ ఫ్లాప్ గా రికార్డు నమెదు చేసింది. బ్యాడ్ స్టోరీ, అంతకన్నా వరస్ట్ స్క్రీన్ ప్లే, నవ్వించే విలన్ పాత్ర ఉండడం వలన ఈ సినిమా చూడడం అభిమానులకు పరీక్షగా మారింది.
లియో
ఇదిలా ఉంటే తాజాగా ఈ లిస్ట్‌లోకి లియో (సింహం) కూడా చేరింది. ఈ సినిమాకి ఇప్పటి వరకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.. అయితే ఇది గొప్ప సినిమా కాదంటున్నారు విమర్శకులు. దీంతో నటుడు విజయ్‌కు యానిమాల్ డిసార్డర్ ఉందని, జంతువులకు విజయ్‌కు కలిసి రావడం లేదని నెటిజెన్లు ట్రోల్స్ చేస్తూన్నారు.