Lenin | టాలీవుడ్లో అరంగేట్రానికి ముందే భారీ హైప్ తెచ్చుకున్న హీరోల్లో అఖిల్ అక్కినేని ఒకరు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నటించిన ‘చిరుత’ను మించిన స్థాయిలో అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’కు క్రేజ్ లభించింది. అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అఖిల్ కెరీర్‌కు మొదటి నుంచే పెద్ద షాక్ తగిలింది.ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడానికి అఖిల్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, పెద్ద విజయాలు దక్కలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో మోస్తరు హిట్ కొట్టినప్పటికీ , ఏజెంట్ డిజాస్టర్‌తో మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘లెనిన్’ సినిమా మీదే పెట్టుకున్నాడు.
అయితే ఈ సినిమాకు రిలీజ్ డేట్ వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. మొదట ఏప్రిల్ 30న పెద్దితో క్లాష్ కాకుండా మే 1కి ‘లెనిన్’ను వాయిదా వేసినట్లు ప్రకటించారు. కానీ కొద్దిరోజుల్లోనే అసలు విషయం బయటపడింది. ‘పెద్ది’ వాయిదా పడినా కూడా ‘లెనిన్’ మే 1న రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని తేలిపోయింది. దీంతో సినిమాపై అనవసర నెగెటివిటీ పెరిగింది. ఆ తర్వాత ‘లెనిన్’ కోసం జూన్ 25ని కొత్త రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు అదే తేదీకి ‘పెద్ది’ రావచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మొదట జూన్ 4న రిలీజ్ అవుతుందని భావించిన టాక్సిక్ వాయిదా పడుతుందేమోనని ‘పెద్ది’ టీం ఆలోచించింది. కానీ ‘టాక్సిక్’ నిర్ణయించిన తేదీకే వస్తుందని సమాచారం రావడంతో, మూడు వారాల గ్యాప్ తీసుకుని జూన్ 25నే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు పరిస్థితి చూస్తే ‘లెనిన్’ టీంకు మరోసారి డేట్ మార్చుకోవడం తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి భారీ ప్రాజెక్ట్‌తో పోటీ పడే స్థితిలో ‘లెనిన్’ లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండస్ట్రీ మొత్తం ‘పెద్ది’ విడుదల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఆ సినిమాకు మార్గం సుగమం చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకపోవచ్చు. మొత్తానికి, రిలీజ్ డేట్ గందరగోళం ‘లెనిన్’కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే డిలేలు, నెగెటివ్ టాక్ మధ్య ఇరుక్కున్న ఈ సినిమా… మరోసారి వాయిదా పడితే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. ఈసారి డేట్ మార్చేటప్పుడు టీం ఏ కారణం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.