Singer Janaki | బ్రేకింగ్.. ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూత..!
Singer Janaki : ప్రముఖ గాయని ఎస్.జానకి (Singer Janaki) కన్నుమూశారు. మైసూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానకి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
Singer Janaki : ప్రముఖ సినీనేపథ్య గాయని ఎస్.జానకి (Singer Janaki) కన్నుమూశారు. మైసూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానకి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కలిపి 50వేలకు పైగా పాటలతో గాన కోకిలగా విరాజిల్లిన జానకి ఇక లేరనే వార్త సంగీత ప్రియులను కలచివేస్తోంది.
లెజెండరీ గాయని ఎస్.జానకి గుండెపోటుతో మరణించారు. మైసూర్‌లోని అపోలో బీజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె 88 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు. తన మధురమైన గాత్రంతో సంగీత ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్న జానకి ఇకలేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Popular Kannada playback singer Padmabhushan S Janaki, passed away at Apollo BGS Hospitals in Mysuru on Saturday, July 11. She was 88 and a resident of Mysuru.#Mysuru #SJanaki #Mysoorunews pic.twitter.com/xccWjakCpp
— Mysoorunews.com (@Mysoorunews_com) July 11, 2026
Breaking News
Veteran and Legendary Singer
S .Janaki passed away few minutes before in Mysore…#RIPSJanaki 😭🎧 #RIPJanaki pic.twitter.com/QTpZKoPtyI— Filmi Street (@filmistreet) July 11, 2026
తమిళంలో మొదటి పాట
దక్షిణాదిలో నేపథ్య గాయనిగా పాపులరైన ఎస్.జానకి 1938 ఏప్రిల్ 23న జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పల్లపట్ల ఆమె స్వస్థలం. నేపథ్య గాయనిగా తమిళంలో మొదటి పాటపాడారు. అనంతరం 1957లో విడుదలైన ఎమ్మెల్యే చిత్రంలో నీ ఆశ ఆడియాస పాటతో ఆమె తెలుగు అభిమానులకు పరిచయమయ్యారు.
RIP – S. Janaki – the Nightingale of South India 🕊️ pic.twitter.com/SwEBJsGR3d
— AIB (@timeout_7) July 11, 2026
తొలితరం గాయకుడు ఘంటసాల నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనూ ఎన్నో అద్భుతమైన గీతాలు ఆలపించారు జానకి. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారామె. పది నంది అవార్డులు.. కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు.. ఒడిశా నుంచి ఒకటి.. 1986లో కలైమామణి అవార్డు స్వీకరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

