Gopichand 30 | యాక్షన్ హీరో 30వ చిత్రం..జాయిన్ అయిన అలనాటి తార
యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం శ్రీవాసు (Sriwass) డైరెక్షన్లో గోపీచంద్ 30 (Gopichand 30) ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్‌లో షురూ అయింది.
గతేడాది సీటీమార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand). సంపత్ నంది డైరెక్షన్లో కబడ్డీ క్రీడ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ హీరో ప్రస్తుతం శ్రీవాసు (Sriwass) డైరెక్షన్లో గోపీచంద్ 30 (Gopichand 30) ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్‌లో షురూ అయింది. ఖిలాడీ ఫేం డింపుల్ హయతి (Dimple Hayathi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
దీంతోపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే అలనాటి అందాల తార, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) తాజా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ స్పెషల్స్టిల్తో షేర్ చేసుకున్నారు. ఖుష్బూ సుందర్ ఇప్పటికే వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు జగపతిబాబు కీరోల్ పోషిస్తున్నాడు.
Team #Gopichand30 is elated to Welcome the Veteran and Ever-Versatile actress @khushsundar garu ONBOARD 🤗
⭐️ing @YoursGopichand
A Film by @DirectorSriwass 🎬
In @peoplemediafcy Production@IamJagguBhai @vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/KcuCvgSAMy— People Media Factory (@peoplemediafcy) March 3, 2022
సిల్వర్ స్క్రీన్‌పై జగ్గూభాయ్, గోపీచంద్, ఖుష్బూ సుందర్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందన్నది ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. మరోవైపు మారుతి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

