The Raja Saab | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ నుంచి షూటింగ్ ప్రభాస్ ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లోని గ్రీస్‌లో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం అంత యూరప్ వెళ్లింది. అయితే యూరప్ షెడ్యూల్లో భాగంగా ప్రభాస్ స్టెప్పులు వేస్తున్న కొన్ని దృశ్యాలు అనధికారికంగా ఆన్లైన్లో లీకయ్యాయి. లీకైన ఫోటోలలో ప్రభాస్ ఎంతో ఎనర్జిటిక్‌గా, పూర్తి మాస్ అవతార్‌లో కనిపించారు. ముఖ్యంగా తెల్లని ట్రౌజర్, రంగురంగుల జాకెట్ మరియు స్టైలిష్ షూస్ ధరించి ఉన్న ప్రభాస్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రభాస్‌ను ఇంత కలర్ఫుల్గా, ఉల్లాసంగా చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు షూటింగ్ విజువల్స్ లీక్ కావడం పట్ల మేకర్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. సినిమాలోని సర్ప్రైజ్ అంశాలు, థియేటర్లో ప్రేక్షకులు పొందే అనుభూతి లీక్‌ల వల్ల తగ్గే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్‌దత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#Prabhas From #TheRajasaab
Colour ful Cutout 💥🥵 pic.twitter.com/0glhV84oVl
— Prabhas Warriors (@RebelWoodX) October 9, 2025