Matka | మెగా హీరో వరుణ్‌తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా ‘లే లే రాజా..’ అంటూ సాగే ఈ సినిమాలోని తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. రెట్రో అనుభూతిని కలిగించేలా భాస్కరభట్ల రాసిన ఈ పాటను 70, 80ల కాలం నాటి తీరులో జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరిచారు. నీతి మోహన్ ఆలపించారు.
ఈ పాటలో వరుణ్‌తేజ్ భిన్నమైన గెటప్పులతో ఆకట్టుకోగా, కలర్‌ఫుల్ పబ్ నేపథ్యంలో సాగిన ఈ పాటలో నోరా ఫతేహి రెట్రో లుక్‌లో అలరించారు. జానీ మాస్టర్ నృత్య రీతులు ఈ పాటకు హైలైట్‌గా నిలిచాయి. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈచిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. నవీన్‌చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎ.కిశోర్‌కుమార్.