Shivaji-Laya | శివాజీ, లయ జోడీ మరోసారి వెండితెరపై కనువిందు చేయనున్నది. ఇద్దరి కాంబినేషనల్లో టాటాబిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ చిత్రాలు రాగా.. ప్రేక్షకులను ఆకట్టున్నాయి. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మరోసారి జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శివాజీ, లయ హీరో హీరోయిన్లుగా ఓ కామెడి క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కనున్నది. ఈ మూవీకి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఈ మూవీతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరో విశేషం ఏంటంటే శివాజీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తన సొంత శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరగ్గా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. శివాజీ తనయుడు రిక్కీ కెమెరా స్విచ్చాన్ చేయగా.. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ముహూర్తం షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ నెల 20 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగనున్నది. ఇంకా సినిమా టైటిల్ ఖరారు కాలేదు. త్వరలోనే మిగతా ఆర్టిస్టుల వివరాలను ప్రకటించనున్నారు. లయ చివరిసారిగా టాటాబిర్లా మధ్యలోలైలా చిత్రంలో కనిపించింది. చివరిసారిగా అమర్ అక్బర్ ఆంథోనీ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నది. ఈ మూవీతో నితిన్ తమ్ముడు మూవీలో సైతం నటిస్తున్నది.