Lawrence | కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు… ఇలా ఎన్నో పాత్రల్లో మెప్పించిన రాఘవ లారెన్స్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఆయన, ఈసారి దివ్యాంగ యువ డ్యాన్సర్లకు తగిన గౌరవం అందించారు. డ్యాన్స్ పట్ల వారికున్న అభిరుచిని గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లారెన్స్ సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియోలో లారెన్స్ మాట్లాడుతూ..నేను డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు, ప్రేక్షకులు నా చొక్కాకు రూ.1 నోట్లు గుచ్చేవారు… పూల దండలు వేసేవారు. అది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాంటి అనుభూతిని నా బాయ్స్‌కు కూడా ఇవ్వాలనుకున్నాను. అందుకే వాళ్లపై నోట్ల జల్లు కురిపించాను. ఇది కేవలం ప్రశంస కాదు, ప్రోత్సాహం కూడా” అని ఆయన పేర్కొన్నారు. లారెన్స్ ప్రోత్సహించిన వారందరూ దివ్యాంగులే అయినా, డ్యాన్స్ కళలో విభిన్నతను చూపిస్తున్న ప్రతిభావంతులు. వారి ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అందరి ముందూ వారిని గౌరవించడం జరిగింది అని పేర్కొన్నారు. స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచారు.
ఇక లారెన్స్ వారి విషయంలో ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు. వారిని మీ వేడుకలకు ఆహ్వానించి ప్రదర్శన కల్పించండి. వారి నృత్యం చూస్తే మీరు ఆనందించడమే కాదు, వారి ప్రదర్శన ఎంతో మందికి స్ఫూర్తినివ్వడంతో పాటు సంతోషాన్నీ కలిగిస్తుంది అని లారెన్స్ సూచించారు. ఇక లారెన్స్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాంచన 4తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో మరో బడా హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు.
Hi everyone,
You all know the incredible journey I’ve shared with my specially-abled boys so far. Back in the days when I was a dancer, audiences would often pin Re. 1 notes and place them as garlands on me, a gesture of appreciation.
I wanted to recreate that same joy for my… pic.twitter.com/r8hYcy1kxj
— Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2025