Sathi Leelavathi | టాలీవుడ్ భామ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం సతీలీలావతి (Sathi Leelavathi). తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్.. టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. మేకర్స్ సతీలీలావతికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ లావణ్య త్రిపాఠి కొత్త పోస్టర్ షేర్ చేశారు.
ఇప్పటికే మేకర్స్ చిత్తూరు పిల్ల లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా..లావణ్య త్రిపాఠి పెళ్లి కూతురిలా మారిపోయి పాడుకుంటున్న ఈ సాంగ్ సినిమాపై మూవీ లవర్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. వనమాలి రాసిన ఈ పాటను మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో నూతన మోహన్, కృష్ణ తేజస్వి, రితేశ్ జీ రావు పాడారు. లావణ్య త్రిపాఠి ఈ పాటలో సూపర్ గ్లామరస్‌గా కనిపిస్తూ అభిమానులు, ఫాలోవర్లను ఖుషీ చేస్తోంది.
సతీలీలావతి చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నాగమోహన్ బాబు ఎం, రాజేష్ టీ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Happy Birthday to our “LEELA” — the stunning and immensely talented @Itslavanya 🎉🎂
Here’s to bigger roles, stronger stories, and blockbuster success ahead 🎬💥
— Team #SathiLeelavathi#HBDLavanyaTripathi pic.twitter.com/vfHb0DHDDd
— BA Raju’s Team (@baraju_SuperHit) December 15, 2025
Ustaad Bhagat Singh | ఉస్తాద్భగత్ సింగ్‌తో హరీష్ శంకర్ సెల్ఫీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్