Lavanya Tripathi | కంటెంట్ ఉంటే డెబ్యూ హీరో కూడా బ్లాక్ బస్టర్ సాధించచ్చు అని ‘మత్తు వదలరా’ చిత్రం నిరూపించింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణీ చిన్న కొడుకు సింహా హీరోగా పరిచయమవుతూ నటించిన ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహించాడు. రితేష్ కథ, స్క్రీన్ప్లే రాసుకున్న విధానం ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2019లో విడుదలైన బెస్ట్ చిత్రాలలో మత్తువదలరా ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం తర్వాత రితేష రానా రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ‘హ్యపి బర్త్డే’ సినిమాకు దర్శకత్వం వహించాడు.
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గతేడాది నవంబర్లో ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో లావణ్య గన్స్ పట్టుకొని గంతేస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 15న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
You are all invited to the laugh riot 😆
The #HappyBirthday party begins in theatres from July 15, 2022. 🎉
No GUN No Entry#HBDMovie #HBDMovieOnJuly15@Itslavanya @nareshagastya @vennelakishore #Satya @kaalabhairava7 @sureshsarangam @ClapEntrtmnt @MythriOfficial pic.twitter.com/CBldLqtZXG
— Ritesh Rana (@RiteshRana) May 5, 2022