Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఈ సారి ఉస్తాద్ భగత్ సింగ్‌లో అది లేనట్టే ..!
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే తెలుగు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి పవన్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే హిట్ కాంబో మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే తెలుగు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి పవన్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే హిట్ కాంబో మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తమిళంలో విజయవంతమైన తేరి చిత్రానికి ఆధారంగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 2026 మార్చి 26న థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మొదట ఈ తేదీకి రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా రానుందని ప్రచారం జరిగినా, ఆ చిత్రం మే నెలకు వాయిదా పడడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కి మార్గం సుగమమైందని టాక్ వినిపిస్తోంది. దీంతో సమ్మర్ సీజన్‌కు ముందే పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నట్టు భావిస్తున్నారు. సంగీత పరంగా కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌కు ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్‌లోని ‘కెవ్వు కేక’ లాంటి ఐటెం సాంగ్ ఈ సినిమాలో ఉండదని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ప్రతి పాట కూడా అభిమానులను ఆకట్టుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. దీంతో మ్యూజిక్ పరంగా కూడా సినిమా ప్రత్యేకతను సంతరించుకోనుంది.
యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన భాగం షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. సాంకేతికంగా హై స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించారు. ఆయన తదుపరి సినిమాలపై స్పష్టత లేకపోయినా, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం అభిమానులకు పెద్ద ట్రీట్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత అదే దర్శకుడితో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ కాంబో మరోసారి మేజిక్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

