Anil Ravipudi | టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు వినగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. అలాంటి క్రేజీ కాంబోలో ఒకటి విక్టరీ వెంకటేష్–అనిల్ రావిపూడి జోడీ. వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ కొత్త సినిమాలో వెంకటేష్ ప్రధాన హీరోగా నటించనుండగా, అతనికి తోడుగా మరో స్టార్ హీరోను తీసుకురావాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో కార్తీ పేరు, మళయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
అయితే ఇద్దరూ కూడా తమ తమ భాషల్లో ప్రామిసింగ్ నటులుగా నిలిచిన వారు కావడంతో, ఎవరు ఎంపికైనా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్లో హిట్ మెషీన్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా వెంకటేష్‌తో చేసిన ఎఫ్2, ఎఫ్3, అలాగే ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ఏర్పడింది.
ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యిన వెంటనే అనిల్ రావిపూడి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి తన సినిమాలను వేగంగా పూర్తి చేయడంలో పేరుగాంచిన దర్శకుడు కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను కూడా తక్కువ సమయంలో పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.మొత్తానికి విక్టరీ వెంకటేష్‌తో పాటు కార్తీ లేదా ఫహాద్ ఫాజిల్లో ఎవరో ఒకరు కలిసి నటించే మల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌కు అనిల్ రావిపూడి శ్రీకారం చుట్టనున్నాడన్న వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకముందే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొనడం విశేషం.