Lavanya Tripathi | వరుణ్ తేజ్‌ని వివాహం చేసుకున్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో లావణ్య త్రిపాఠి తాజాగా చేస్తున్న చిత్రం సతీ లీలావతి. దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందగా, తాజాగా మూవీ నుండి ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే పాట విడుదల చేశారు. పాటకు వనమాలి హృద్యమైన సాహిత్యాన్ని అందించగా,సంగీతాన్ని మిక్కీ జే మేయర్ స్వరపరిచారు.బృందా మాస్టర్ అందించిన నృత్యాలు పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.ఈ మెలోడియస్ ట్రాక్‌ను నూతన మోహన్, కృష్ణ తేజస్వి, రితేష్ జీ రావ్ ఆలపించారు.
పెళ్లి సంబరాల్లో ఈ పాటను ప్లే చేసేలా మేకర్లు తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వీలైనంత త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్టైనింగ్గానూ తెరకెక్కించినట్టుగా ఆ మధ్య విడుదలైన టీజర్‌ను చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది.తాజాగా విడుదలైన పాట మేన బావను ప్రేమించి పెళ్ళి చేసుకునే అమ్మాయి తన మనసులో భావాలను వివాహ తంతు నేపథ్యంలో వెల్లడిచేసే పాటగా రూపొందించారు. ఆలుమగలు మధ్య ఏర్పడే కలతలు, కలహాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. చిత్రంలో నరేశ్ విజయకృష్ణ, విటీవీ గణేశ్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సిద్ధిక్, తాగుబోతు రమేశ్, జోషి తదితరులు పోషించారు.