‘గన్ లేకపోతే లోపలికి ఎంట్రీ లేదు’ అంటూ హెచ్చరికను జారీచేస్తోంది లావణ్య త్రిపాఠి. ఆమె కథానాయికగా రితేష్‌రానా (‘మత్తు వదలరా’ ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘హ్యాపీబర్త్‌డే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. బుధవారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్లో మిషన్‌గన్ పట్టుకొని ఫైరింగ్ చేస్తూ లావణ్య త్రిపాఠి కనిపిస్తున్నది. ‘నో గన్ నో ఎంట్రీ’ అనే క్యాప్షన్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. వినూత్నమైన పాయింట్‌తో రితేష్‌రానా సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. ప్రస్తుతం ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతున్నాం’ అని తెలిపారు. నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్.