Raj Tarun – Lavanya | టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఉంటున్న ఇంటిముందు వాగ్వాదానికి దిగారు. ఇల్లు తమదంటూ రాజ్ పేరెంట్స్ వెళ్లగా.. ఇక్కడ ఏ ఇల్లు లేదంటూ వారిని బయటకు పంపించింది లావణ్య. దీంతో రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇంటిముందు ధర్నాకు దిగారు.
అయితే ఈ విషయంపై లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ నేను కలిసి ఈ ఇల్లు కొన్నామని.. ఇల్లు కొన్నప్పుడు తాను రూ.70 లక్షలు రాజ్ తరుణ్‌కి ఇచ్చినట్లు లావణ్య మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. 11 ఏండ్లు రాజ్ తరుణ్ నాతో లివ్ ఇన్ రిలేషన్(పెళ్లి కాకుండా కలిసి ఉండడం)లో ఉన్నాడు. అతడు తనతో ఉంటాడని నా జీవితం మొత్తం అతడికే సమర్పించాను. నా వద్ద ఉన్న డబ్బులు కూడా అతడికే ఇచ్చాను. ఇప్పడు అతడి పేరెంట్స్ వచ్చి ఇల్లు తమదని అంటున్నారు. ఇంటికి సంబంధించి తనకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఇల్లును మేం కొన్నప్పుడు రూ. 1.5 కోట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.12 కోట్లకు పెరిగింది. నేను అసలు రాజ్ తరుణ్ పేరెంట్స్‌ని టచ్ కూడా చేయాలేదు. వాళ్లే ఇంట్లోకి వచ్చి వస్తువులను ధ్వంసం చేశారు. నన్ను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారంటూ లావణ్య చెప్పుకోచ్చింది.