కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. నవీన్ మేడారం దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ైక్లెమాక్స్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
కల్యాణ్‌రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా సరికొత్త అవతారంలో కనిపిస్తారు. ఐదొందల మంది పాల్గొనగా ైక్లెమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్.ఎస్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, దర్శకత్వం: నవీన్ మేడారం.