తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20న ‘వార్ 2’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు వస్తున్న స్పందనపై తాజాగా ఎన్టీఆర్ స్పందించారు. ‘ఈ ప్రశంసలు, అభిమానులు కురిపిస్తున్న ప్రేమ చూస్తుంటే నటుడ్ని అయినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. అభిమానుల ప్రేమను దేవుడిచ్చిన వరంలా భావిస్తున్నా. ముఖ్యంగా ‘వార్ 2’పై మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న స్పందన చూసి ఉప్పొంగిపోయాను. ఒక్క టీజర్ ఇంతటి ప్రభావం చూపించడం, ఆడియన్స్‌పై ఇంతటి ముద్ర వేయడం సామాన్యమైన విషయం కాదు. నిజంగా ఈ స్పందన చూస్తుంటే పట్టరాని ఆనందం కలుగుతోంది.
ఈ యష్‌రాజ్ స్పై యూనివర్స్‌లో నన్ను కొత్తగా చూపించారు. ఈ మూవీ కోసం అంతా ఎంతో సరదాగా కలిసి పనిచేశాం. ఇందులో నా పాత్ర చాలా ప్రత్యేకమైనది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడం ఖాయం. రేపు థియేటర్లలో మీ స్పందన చూసేందుకు ఎదురుచూస్తున్నా.’ అని తారక్ అన్నారు. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది.