Project K | ప్రముఖ కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఇది. విలక్షణ నటుడు కమల్‌హాసన్ ఇటీవల ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఆయన చేరికతో మరింత బలం చేకూరింది.శాన్ డియాగో కామిక్ కాన్‌లో పాల్గోనే మొదటి భారతీయ చిత్రంగా నిలవడం సంతోషంగా వుంది.
ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సెపియా టోన్డ్ క్యాప్టీవేటింగ్ ఇమేజ్‌లో ప్రభాస్ పవర్ఫుల్ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ‘ప్రాజెక్ట్ కె’ శాన్ డియాగో కామిక్ కాన్ లోని ప్రతిష్టాత్మకమైన హెచ్ హాల్లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా వుంది. ఈ ఈవెంట్లోనే టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేస్తున్నాం’ అన్నారు. అమితాబచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొణే, దిశా పఠానిలు ఈ చిత్రంలో ముఖ్యతారలుగా నటిస్తున్నారు.