Coolie | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఫహద్ ఫాసిల్ ఇప్పటికే రజినీ కాంత్‌తో ‘వేటగాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి కాంబో ’కూలీ’లో మళ్లీ రిపీట్ అవ్వనుంది. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రంలో కూడా ఫహద్ ఫాసిల్ అండర్‌కవర్ ఏజెంట్‌గా నటించాడు. దీంతో కూలీలో కూడా మరో పవర్ఫుల్ రోల్లో అలరించబోతున్నట్లు తెలుస్తుంది.