GlobeTrotter | దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ని (GlobeTrotter) పరిచయం చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఒక సాలిడ్ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో రాజమౌళి బ్లూ-స్క్రీన్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట ఈ సినిమా షూటింగ్‌ను కెన్యాలోని నేషనల్ పార్క్‌లలో చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రాజమౌళి కూడా అక్కడి లోకేషన్లను జల్లెడ పట్టి వచ్చాడు. అయితే ప్రస్తుతం కెన్యాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, రాజమౌళి కెన్యాకు బదులుగా టాంజానియాలోని సెరెంగెటి అడవుల్లో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బ్లూ-స్క్రీన్ టెక్నాలజీని ఉపయోగించి ఆఫ్రికా అడవులను గ్రాఫిక్స్ ద్వారా రూపొందించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు విషయాలపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.